Archive for అక్టోబర్, 2011

సరిహద్దు సమీక్ష, ఆంధ్రజ్యోతిలో


సరిహద్దు సమీక్ష, ఆంధ్రజ్యోతిలో

జాజర


తీరం దాటినా తీరని వెతలు


ఎంత అగ్రదేశమైనా అమెరికాకూ కష్టాలున్నాయి. ఎంతటి అపర కుబేరులైనా అక్కడి జనాలకూ దుఃఖ సమయాలున్నాయి. అక్కడే స్థిరపడిన, ఆ ప్రయత్నంలో ఉన్న తెలుగువారికీ తెగని సమస్యలున్నాయి. అమెరికా సమాజంలో ఇమిడిపోయే క్రమంలో మనవాళ్ళకు ఎదురవుతున్న సమస్యలు వాటిలో కొన్నయితే, ఆవకాయని, అప్పడాలను వెంట పట్టుకెళ్ళినట్టు కులాన్ని, కురచ బుద్ధిని కూడా తీసుకెళ్ళడం వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకొన్ని.

ఈ రెండు రకాల అవస్థలను చిత్రీకరించిన డయోస్పోరా సాహిత్యం చాలానే అందుబాటులోకి వస్తోంది. సాపేక్షంగా వాటి కన్నా మరింత శ్రద్ధగా, సీరియస్‌గా ఈ సమస్యలను పట్టించుకొని రాస్తున్న ఎన్ఆర్ఐ కథకుడు సాయి బ్రహ్మానందం గొర్తి. సరిహద్దు దాటిన బతుకుల్లోని సార్వత్రిక అనుభవాలను 25 కథలుగా ‘సరిహద్దు’ సంపుటిలో రచయిత ఏర్చి కూర్చారు. కోనసీమ నుంచి కాలిఫోర్నియాకు ప్రవాసం పోయిన రచయిత- ఆ రెండు ప్రాంతాల మధ్య ఉన్న భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ కథలు రాశారనిపిస్తోంది.

అమెరికా పుట్టుకలోని ‘ఇల్లీగలారిటీ’ని టైటిల్ కథలో, అక్కడి తెలుగు సమాజంలో పుట్టలు పెడుతోన్న కుల ధోరణులు, పురుషాధిపత్య భావజాలం, వరకట్న వేధింపులు, పెళ్లిళ్లలోని మోసాలను మిగతా కథల్లో నిజాయితీగా చర్చించారు. కొంటెతనం, పెట్టుడు హాస్యంతో ప్రహసనంగా మారుతున్న డయోస్పోరా సాహిత్యంలో ‘సరిహద్దు’ వంటి కథలను ఊహించడం కష్టమే. ఈ ధార మరింత ఉధృతమై, తెలుగు సాహిత్యానికి అదనపు పుష్టిని ఇవ్వాలని ఆశిద్దాం.

-అరవింద్

కథల పుస్తకం ఇక్కడ దొరుకుతుంది:

AVKF Online BOOK Store

Kinige Online BOOK Store

వ్యాఖ్యానించండి

Older Posts »