Archive for డిసెంబర్, 2010

ఆరేళ్ళ క్రితం నాటి కథ – సైన్యం

జాజర


ఆరేళ్ళ క్రితం నాటి కథ – సైన్యం – నవ్యలో ప్రచురితమయ్యింది.
తెలుగు ప్రతి ఇక్కడ చదవ్వచ్చు.

త్వరలో ఈ కథ తమిళ అనువాదం రాబోతోంది.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు

నేహల – పన్నెండో భాగం

జాజర

14వ శతాబ్దంలో స్వేచ్ఛ కోసం చరిత్రకి బలైన ఓ ముగ్ధ కథ – నేహల

విజయనగర మహారాజు దేవరాయలు బహమనీ సుల్తానుల తిరుగుబాటును రాయచూరు వద్ద తిప్పికొడతాడు. ఆ విజయోత్సవాన్ని విజయదశమినాడు జరుపుకుంటూ రాజ్య నలుమూల నుండీ అందర్నీ ఆహ్వానిస్తాడు. ఆ సందర్భంలో జరిగే వేడుకలకి ముద్గల్ వాసులైన వేదరాయశర్మా, ఆయన శిష్యుడు రేవన్నా ఓ నృత్యనాటిక ప్రదర్శనకై విజయనగరం వస్తారు. దేవరాయలు బహమనీ రాజులపై కన్నేసే నిమిత్తమై వేగులని నియమిస్తాడు. కోట విస్తీనార్ణి పెంచడానికి మంచి ముహూర్తం నిర్ణయించమని వేదరాయ శర్మని కోరుకుంటాడు. వేదరాయ శర్మ విజయనగర చరిత్రని రేవన్నకి చెబుతాడు.

బహమనీ సుల్తానుల పాలనలో ఉన్న గుల్బర్గా ప్రాంతానికి
సుల్తాను ఫిరోజ్ షా. అతని రాజవ్వడానికి కారకుడైన మత ప్రవక్త గిసు దరాజ్ యుద్ధాలు మాని ప్రజల్ని మంచిగా చూసుకోమని హెచ్చరిస్తాడు. ఫిరోజ్‌షా తమ్ముడు అహ్మద్‌ఖాన్ ఎలాగైనా విజయనగరాన్ని ఆక్రమించుకోవాలన్న ఉద్దేశ్యంతో పథకాలు వేస్తూ ఉంటాడు.

రేవన్న విజయనగరంలో విరూపాక్ష దేవాలయం సందర్శిస్తాడు. అక్కడ అతని ప్రియురాలు నేహలకి తన కవిత్వంతో ప్రేమ లేఖని రాయిస్తాడు. స్వచ్ఛమైన అతని ప్రేమని చూసి ఆ దుకాణదారుడు రేవన్నకి పద్మాకారంలో ఉన్న ఒక పతకాన్ని బహూకరిస్తాడు. రేవన్నకి ప్రియురాలు నేహల పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది.

రేవన్నా, వేదరాయశర్మా విజయనగరంలోనే ఉండాల్సొస్తుంది. మిగతా బృందమంతా ముద్గల్ వెనక్కి వస్తారు. స్నేహితురాలు ప్రభ ద్వారా నేహలకి “సావరహే” ప్రేమ లేఖా పత్రం పంపిస్తాడు రేవన్న.

విజయ నగర దేవరాయల్ని ఎదుర్కోవాలంటే రాయచూరు సమీపంలో కోట ఉండాలని భావిస్తాడు అహ్మద్‌ఖాన్. ఈ విషయమై ఫిరోజ్‌షా ని ఒప్పిస్తాడు. గిసుదరాజ్ అభ్యంతరం చెప్పకుండా ఉండడానికి గుల్బర్గాలో నీటి కరువు తీర్చడానికి భీమ నది నుండి కాలవలు తవ్వే ప్రణాలిక ముందుకు తీసుకొస్తాడు. ఫిరోజ్‌షా పేరు మీద ఫిరోజాబాద్ కోటని కడదామన్న ప్రతిపాదన తీసుకొస్తాడు. ఫిరోజ్‌షా ఒప్పుకుంటాడు.

విజయనగర రాజుల వద్ద వేదరాయశర్మ పలుకబడి గ్రహిస్తాడు రేవన్న. తిరుగు ప్రయాణంలో విజయనగర వేగు మసూమ్ వారితో కలిసి ప్రయాణిస్తాడు. వేదరాయశర్మకి విజయనగర రాజ్య వ్యూహాల్లో భాగం ఉందని తెలుస్తుంది రేవన్నకి.

వేదరాయ శర్మా, రేవన్న విజయనగరం నుండి ముద్గల్ తిరిగి వస్తారు. దారిలో మసూమ్ అనే వేగుని రేవన్నకి పరిచయం చేస్తాడు వేదరాయశర్మ. విజయనగరం నుండి తెచ్చిన కానుకగా నేహలకి పద్మాకారం బిళ్ళ వున్న తాయత్తుని చేతికి కడతాడు రేవన్న.

భీమనది నుండి గుల్బర్గాకి నీరు మళ్ళించే పేరుతో ఫిరోజాబాద్ పేరుతో ఒక్కడ ఒక కోట కడదామని ఎత్తు వేస్తాడు అహ్మద్‌ఖాన్. నదీజలాల మళ్ళింపుని గిసుదరాజ్ ప్రోత్సహిస్తాడు. ధనాగారం నిండుకుందన్న నెపంతో ప్రజలపై కొత్త పన్ను విధించడానికి ఫిరోజ్షాని ఒప్పిస్తాడు అహ్మద్‌ఖాన్.

వేదరాయశర్మ ఇంటికి నగలన్నీ అలంకరించుకొని వస్తుంది నేహల. అందరూ ఆమె అందం చూసి అబ్బురపడతారు. నేహల అందం ముందు ఏ రాణి వాసపు స్త్రీ పనికిరాదని వేదరాయశర్మ భార్యతో చెబుతాడు.

భీమనది ఒడ్డున కోట నిర్మాణ పనులు మొదలు పెడతారు. రాయచూరునుండి శిల్పుల్ని పనికి కుదిర్చేవాడిగా అహ్మద్‌ఖాన్ వద్ద ఒప్పుకుంటాడు మసూమ్.

విజయనగర కోట ప్రాకార శంఖుస్థాపనకి వేదరాయశర్మకి తోడుగా శభుడు అనే మరో శిష్యుణ్ణి తీసుకెళతాడు. రేవన్న తల్లికి సుస్తీ చేసిందన్న సాకుతో వెళ్ళడం మానుకుంటాడు. నేహల పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడు ఆమెని ఏ రాజో వరిస్తాడని అంటాడు వేదరాయశర్మ. విజయనగరానికి వెళ్ళద్దని రేవన్నని నేహల కోరుతుంది.

వేదరాయ శర్మ మరో శిష్యుడు శంభుడితో విజయనగరం వెళతాడు. కోట ప్రాకార శంఖుస్థాపనకి తను పెట్టిన ముహూర్త సమయం కాదని వేరే ముహూర్తం నిర్ణయించడం చూసి వేదరాయ శర్మ ఆవేదన చెందుతాడు. భీమనది ఒడ్డున ఫిరోజా షా నిర్మించే కొత్త కోట నమూనాను వేదరాయశర్మ దేవరాయలుకి అందిస్తాడు. ఆ సందర్భంలో దక్షినాడి రమణి పేలవమైన నాట్య ప్రదర్శన చూసి వేదరాయశర్మ నేహల ప్రస్తావన తీసుకొస్తాడు. నేహలని చూడాలన్న ఉత్సాహాన్ని దేవరాయలు ప్రదర్శిస్తే ఆమె చిత్రాన్ని వేయడానికి శంభుడు ఆసక్తి చూపిస్తాడు. దేవరాయలు అనుమతిస్తాడు.

తనని తూలనాడిన నేహలపై కక్ష సాధించే ప్రయత్నంలో శంభుడు నేహల చిత్రపటం గీసి దేవరాయలకి చూపిస్తాడు. నేహల అందం చూసి ముగ్ధుడైన దేవరాయలు ఆమెను తన మహారాణిగా చేసుకోవాలన్న అభిలాషని వ్యక్తపరుస్తాడు. నేహలకి కానుకలు పంపించి విజయనగర తోడ్కొని రమ్మనమని భూషణాచార్యుణ్ణి ఆదేశిస్తాడు.

నేహలని వివాహమాడడానికి తను ఇష్టపడుతున్నట్లుగా ఆహ్వానం పంపడానికి భూషణాచార్యుణ్ణి ఆదేశిస్తాడు దేవరాయలు. ఇది తెలిసిన నరేంద్ర గజపతి భూష్ణాచార్యుణ్ణి ముద్గల్ వెళితే ప్రాణాలు దక్కవని బెదిరిస్తాడు. భయంతో భూషణాచార్యుడు విరమించుకుంటే ఆ కార్యాన్ని వేదరాయశర్మకప్పగిస్తాడు దేవరాయలు.

కొడుకు హసన్‌ఖాన్ మద్యానికి బానిసయ్యాడని తెలిసి విచారిస్తారు ఫిరోజ్‌షా, భార్య రెహానా.తన్మతన్షా బావమరిది కూతురు మెహజబీన్ హసన్ అంటే ఇష్టపడుతుంది. హసన్ ఖాన్ పుట్టినరోజు జరుపుదామని తన దగ్గరకి రమ్మనమని మెహజబీన్ చేత కబురంపిస్తుంది రెహానా. హసన్‌ఖాన్ ఎప్పటిలాగే మద్యం మత్తులో మునిగి రాడు. ఫిరోజ్షాకి కొడుకు గురించి తెలిసి బాధపడతాడు. కొడుకుని ఎలాగయినా మంచి దారికి తీసుకురావాలని తమ్ముడు అహ్మద్‌ని కోరుతాడు. అహ్మద్‌ఖాన్ గిసుదరాజయితే మంచిదనీ, తన దారికి అడ్డురాడనీ భావిస్తాడు.

హసన్‌ని గిసుదరాజ్ వద్దకి పంపడానికి అనుమతి తీసుకుంటాడు అహ్మద్‌ఖాన్. బలవంతంగా హసన్‌ని గుసుదరాజ్ నివాసానికి తరలిస్తారు. హసన్‌ని పెళ్ళాడి ఎలాగయినా రాణి కావాలన్న తన కోర్కెను తల్లికి చెబుతుంది మెహజబీన్. దేవరాయల ఆహ్వానాన్ని అందించడానికి ముద్గల్ బయల్దేరుతాడు వేదరాయశర్మ.

దేవరాయల ఆహ్వానం తీసుకొని నేహల ఇంటికి వెళతాడు వేదరాయశర్మ. నేహల తల్లితండ్రులు అది చూసి ఎంతో ఆనందిస్తారు. నేహల మాత్రం దేవరాయలతో పెళ్ళికి ఒప్పుకోదు. తండ్రి నచ్చ జెప్పడానికి ప్రయత్నిస్తాడు. వేదరాయశర్మ ఇది రాజులతో వ్యవహారమని హెచ్చరిస్తాడు. నేహల ఎందుకు ఈ పెళ్ళి వద్దంటోందో అర్థంకాదు హరీంద్రకి.
ఇదీ ఇంతవరకూ జరిగిన కథ.

కౌముదిలో నెలనెలా సీరియల్‌గా వస్తోంది. – తరువాయి భాగం ఈ క్రింది లింకులో చదవండి.

నేహల – పన్నెండో భాగం

ఇంతకు ముందు భాగాలు – ఇక్కడ చదవండి.

నేహల – పదకొండో భాగం

నేహల – పదో భాగం

నేహల – తొమ్మిదో భాగం

నేహల – ఎనిమిదో భాగం

నేహల – ఏడో భాగం

నేహల – ఆరో భాగం

నేహల – అయిదో భాగం

నేహల – నాలుగో భాగం

నేహల – మూడో భాగం

నేహల – రెండో భాగం

నేహల – ఒకటో భాగం

వ్యాఖ్యానించండి