తెలుగులో ప్రామాణిక నిఘంటువు కావాలి! – పాలపిట్ట అక్టోబరు సంచిక

జాజర


పాలపిట్ట మాస పత్రిక అక్టోబరు 2010 సంచికలో నిఘంటువులపై నా వ్యాసం

తెలుగులో ప్రామాణిక నిఘంటువు కావాలి!

ఆ మధ్య తెలుగు-తెలుగు నిఘంటువు కొందామని తెలువు విశ్వవిద్యాలయం వారి పుస్తక దుకాణానికి వెళ్ళాను. నిఘంటువంటే అక్కడ వ్యక్తి ఎగా దిగా చూసాడు. అదే డిక్ష్టనరీ అనగానీ నాముందు ఓ పాతిక పుస్తకాలు పడేసాడు. అవన్నీ తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన వృత్తి పదకోశ పుస్తకాలు. అవి కాదనీ, సూర్యరాయాంధ్ర నిఘంటువనగానే వెతుకుతామని చెప్పి, ఓ ప్రతి తీసుకొచ్చాడు. అందులో కొన్ని సంపుటాలు పేజీలు చెద పురుగులు తినేసి పూర్తిగా పోయాయి. ఇంకో ప్రతి లేదంటే, హైద్రాబాదులో ఉన్న ప్రతీ దుకాణం గుమ్మం ఎక్కడం, దిగడం అనే ప్రక్రియకి శ్రీకారం చుట్టడం జరిగింది. అతి కష్టమ్మీద వేరే దుకాణంలో ఒక ప్రతి దొరికింది. ఇంగ్లీషువి మాత్రం ఎక్కడబడితే అక్కడున్నాయి. తెలుగు-తెలుగువి మాత్రం మచ్చుక్కి కూడా కనిపించ లేదు. తెలుగు భాష ప్రాచీన భాష హోదా సంపాదించాం, దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ ఉపన్యాసాలు దంచుకుంటున్నాం. కానీ ఓ తెలుగు భాషా ప్రామాణిక నిఘంటువు ప్రతి కావాలంటే ఆంధ్ర దేశంలో దొరకదు. ఇదీ మన తెలుగు భాష పరిస్థితి.

పూర్తి వ్యాసం ఇక్కడ చదవగలరు.
చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు »

 1. మంచి వ్యాసం.

 2. Rao vemuri said

  వ్యాసం సమగ్రంగా ఉంది. మరి ఇప్పుడు ఎవ్వరు ఏమి చెయ్యాలంటారు? పిల్లికి మెళ్లో ఎవ్వరు గంట కడతారు?
  మనం తయారు చేసుకోబోయే నిఘంటువు ఉత్తనే మాటలకి అర్ధాలు ఇస్తే సరిపోదు. ఆయా మాటలని ఏయే సందర్భాలలో ఎలా ఉపయోగించుకోవాలో కూడ ఉదాహరణలతో ఇచ్చిన నాడు ఆ మాటల వాడుక పెరుగుతుందని నా విశ్వాసం.

  • gorthib said

   వేమూరి గారూ,

   తెలుగు భాషని ఉద్ధరిస్తున్నామూ, ప్రాచీన హోదా తెచ్చిపెట్టాము అనుకునే రాజకెయవేత్తలూ, వాళ్ళ చేతుల్లో నలిగి చచ్చే అకాడమీలూ, యూనివర్శిటీలే ఆ పని చెయ్యాలి. లేదంటే తెలుగంటే ఒక్క చెవే కాదు, కాళ్ళూ, వొళ్ళూ తెగ్గొట్టుకునే బా…..గా డబ్బున్న మహానుభావుడెవరైనా ఈ పనికి పూనుకోవాలి. బాగా డబ్బు ఉన్న తెలుగు వాళ్ళు సినిమాలకి ధారపోస్తారు తప్ప ఇలాంటివాటి జోలికి పోరు. అందువల్ల ఈ పని తెలుగు విశ్వవిద్యాలయం వారే మొదలుపెట్టాలని నా అభిప్రాయం.

   మీరు చెప్పినట్లు వాక్య ప్రయోగాలూ వంటివి కూడా ఉండాలి. సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆవిధంగానే ఉంది. అలాగే పదాల మూలాలు కూడా రాయాలి. తద్వారా ఏ భాషలోంచి ఎత్తుకొచ్చామో కూడా తెలుస్తుంది. లేకపోతే అదృష్టంలా అర్థం మారిపోతుంది.

   -బ్రహ్మానందం

 3. If it is possible please go through this month “NADUSTHUNNA CHARITRA” pathrika. The first “jaanu telugu” philosopher by name BI.SA. Bangaraiah (Vaagari) proposed a wonderful way of making Telugu dictionary. that article was published in October issue

  • gorthib said

   I live in California, US.
   I don’t have access to many weekly/monthly magazines. If you can scan the article and send it to me, I appreciate it.

   Thanks
   -Brahmanandam

 4. వాడపల్లి శేషతల్పశాయి said

  చిన్న సవరణ –
  చెలమచెర్ల రంగాచార్యుల వారిది “ఆంధ్రశబ్దరత్నాకరము.”
  “శబ్దార్థ చంద్రిక”ను మహాకాళి సుబ్బారాయడుగారు వ్రాసారు. ఇది అంగళ్లలో దొరకుతుంది.

  వాడపల్లి శేషతల్పశాయి.
  http://www.andhrabharati.com/dictionary/

  • gorthib said

   శాయి గారూ,

   ఇది నా పొరపాటు. ఈ వ్యాసం రాసి రెండేళ్ళు పైనయ్యింది. చిన్న చిన్న తప్పులున్నాయి. పాలపిట్టలో ప్రచురించాక గమనించాను. ఈ మధ్యనే మరికొన్ని కొత్త నిఘంటువ్లు మార్కెట్లోకి వచ్చాయని విన్నాను.

   మీ సవరణకి ధన్యవాదాలు.

   -బ్రహ్మానందం

 5. మంచి వ్యాసం. అంతర్జాల నిఘంటువులగురించి తెలుగు వికీపీడియా లో నిఘంటువు వ్యాసం (http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%BF%E0%B0%98%E0%B0%82%E0%B0%9F%E0%B1%81%E0%B0%B5%E0%B1%81) చూడండి.
  అలాగే ఎవరైనా పాలు పంచుకొనగలిగే విక్షనరీ తెలుగు నిఘంటువు (http://te.wiktionary.org/) చూడండి. ఎవరో ఏదో చేస్తారని అశించేకన్నా, ఇప్పటి నిఘంటువుల సంకలనకర్తలు, ప్రచురణ కర్తలు వారి నిఘంటువులు విక్షనరీలో పెట్టటానికి అనుమతిస్తే, అసక్తిగల వారు విక్షనరీ అభివృద్ధికి తోడ్పడితే అదే ప్రామాణిక నిఘంటువుగా మారగలదు.

 6. రమణ said

  సూర్యరాయాంధ్ర నిఘంటువు 6,7,8 భాగాలు డిజిటల్ లైబ్రరీ లో దొరుకుతాయి.
  వరుసగా 900,520,535 పేజీలు కలిగి ఉన్నాయి.
  http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0061/842&first=1&last=900&barcode=2990100061837&button=Go

  http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data/upload/0051/802&first=1&last=520&barcode=2990100051797&button=Go

  http://www.new.dli.ernet.in/cgi-bin/test1.pl?next=1&path1=/data_copy/upload/0061/840&first=1&last=535&barcode=2990100061835&button=Go

  ఇవే కాకుండా ఇతర నిఘంటువులు కూడా అందులో ఉన్నాయి.

 7. tell me sir which is the best telugu-telugu dictionary.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: