నేను వేసిన పెయింటింగ్స్ / బొమ్మలు

జాజర

ఎనిమిదో తరగతిలో ఉండగా డ్రాయింగ్ పరీక్షకి కట్టమని నన్ను పోరి పోరిన మా డ్రాయింగు మాస్టారు రాయుడు సుబ్బారావు గారు క్రితం వారం పోయారని తెలిసింది. సరదాకి నేను వేసిన బొమ్మలు చూసి నన్ను ఎలాగైనా డ్రాయింగ్ పరీక్షకి పంపాలని మా నాన్నని బ్రతిమాలీ, బామాలీ నన్ను పరీక్షకి పంపారు. ఈ బొమ్మలతో చదువెక్కడ పోతుందోనని మా నాన్న బెంగ. అప్పటికే నాకున్న హాబీలు చూసి మా నాన్న గతుక్కుమనేవాడు. ఎలా వచ్చాయో తెలీదు. మొత్తానికి అన్నింటా వేలు పెట్టాను. కొన్నింటిలో కాస్తయినా పరవాలేదనిపించినా, మొత్తానికి ఇంకా బాగా రాణించుండేవాడినేమో అనిపించే వాటిల్లో ఈ చిత్రలేఖనం ఒకటి.
నేను కాకుండా మరో ఎనమండుగురం సుబ్బారావు గారి దగ్గర నేర్చుకున్నాం. పరీక్ష మాత్రం నేనొక్కణ్ణే ఫస్ట్ క్లాసులో పాసయ్యాను. పరీక్ష పాసయిన విద్యార్థి అందరికీ పార్టీ ఇవ్వడం రివాజు. మా మాష్టారు మాత్రం నాకు పార్టీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన మాటని దక్కించడమే కాదు. ఆయన విద్యకి చిహ్నాలుగా మేం మిగలాలని ఆయన కోరికని చెప్పారు. ఆయన్ని కలిసి దాదాపు పాతికేళ్ళయ్యింది. కానీ మాష్టారెప్పుడూ కళ్ళ ముందే ఉన్నట్టుండేది. బొమ్మలేయించడమే కాదు; కథలూ, సినిమాలూ ఒకటేమిటి అన్నీ చెప్పేవారు. అప్పట్లో సినిమా పోస్టర్లకి గంగాధర వేసిన బొమ్మల్ని వెయ్యమని మాకు క్లాసులో చెప్పేవారు. చెప్పుకోడానికి జ్ఞాపకాలూ, బాధలూ మిగుల్తున్నాయి. కనీసం అవయినా గుర్తుండేలా చేసిన ఆ …కి నమస్సులు.

దాదాపు పాతికేళ్ళు మరల రంగుల జోలికి పోలేదు. అలవాటు తప్పితే ఏ కళయినా ఆవిరయిపోతుంది. అప్పుడప్పుడు చిన్నగా స్కెచెస్ గీసినా ఇదివరకటి సులువూ, శ్రద్ధా లేవు. ఈ జన్మకింతే! గీతలు గీసే రాత నాకింక అబ్బదు.

ఈ బొమ్మలన్నీ ఆయన పరీక్ష తయారీలో వేసినవే! చాలా బొమ్మలేసినా కొన్నే మిగిలాయి. కొన్ని కొంతమంది స్నేహితులకిచ్చేసాను అప్పట్లో. మిగిలిన వాటిలో కొన్ని.

ఇవి బొమ్మలు కావు; గుర్తుగా మిగిలిన పసి జ్ఞాపకాలివి.

జాజర

జాజర

జాజర

జాజర

జాజర

జాజర

జాజర

జాజర

జాజర

ప్రకటనలు

12 వ్యాఖ్యలు »

 1. Athbhuthanga unnai, Geeta, nee bommalu. nenu copy chesukuntanu – nee peru meede panchadaniki. kruthangynathalatho
  Nee uncle
  Santa Clara

 2. jaya said

  ఎంత బాగున్నాయో!!! చెప్పలేను.

 3. అద్భుతం గా వున్నాయండి…మీరు రాసిన మాటలు కూడా మనసుకి హత్తుకునే లా వున్నాయి.
  నాకూ బొమ్మలేయటం చాలా ఇష్టం గా వుండేది…ఇప్పటికీ ఆ ఇష్టం చంపుకోలేక అప్పుడప్పుడూ paint brush మీద పడుతూ వుంటాను…

 4. అబ్రకదబ్ర said

  కళ ఎక్కడికీ పోదు. మళ్లీ మొదలెట్టండి, అదే వచ్చేస్తుంది.

  (చెప్పటం సులువే. చెయ్యటమే కష్టం. నేనే ఉదాహరణ 😉 )

 5. చాలా చాలా బాగున్నాయి మీ బొమ్మలు. ప్రతిభ , వ్యుత్పత్తి , అభ్యాసం వీటిలో ప్రతిభాచ గరీయసీ అని పెద్దలు చెబుతారు. చిత్ర కళ లో మీ అభినివేశం భతవద్దత్తం. మళ్ళీ బొమ్మలు వేయడం మొదలు పెట్టండి. అబ్రకదబ్ర గారు చక్కగా చెప్పారు. కళ ఎక్కడికీ పోదు.

 6. Excellent! 🙂

 7. padmarpita said

  మీ పెయింటింగ్స్ బాగున్నాయండి!

 8. aswinisri said

  very nice!!

 9. prabhala SrInivaas said

  adbhutamugaa unnaayi..
  mIru marinni citraalu giyyaalani manasaaraa kOrukunTunnaanu.
  kalamu kunchelandu ghanuDuraa… mana brahmanandam..

 10. నిజంగా చాలా బాగున్నాయండి! మీ రాతే కాదు మీ గీత కూడా!సాహిత్యం సంగతేమో గానీ చిత్రలేఖనం మాత్రం అందరికీ అబ్యాసం మీద వచ్చేది కాదు.మీరు ఆపకుండా ఈ వ్యాసంగమూ కొనసాగిస్తే బాగుంటుంది అభినందనలు.

 11. చాలా బావున్నాయి.
  పిట్ట బొమ్మ, అమ్మాయి ముఖం, దాని పైనున్న దృశ్యం అన్నిటికన్నా బాగా నచ్చాయి నాకు.
  ఒక బొమ్మలో చెట్టుని మనిషిలాగా కూడా అనిపించేలా వేశారు కదా?

 12. sbmurali2007 said

  సాయి గారూ,
  మీ బొమ్మలు చాలా బాగున్నవండీ.
  మీరంటున్న “ఈ జన్మకింతే” అన్న భావం సరైనది కాదు.
  మా మావగారు (శ్రీ రామకృష్నన్ గారు) ఇండియా సిమెంట్స్ ఫేక్టరీలో పెద్ద ఎక్జిక్యూటివ్ గా పని చేసి రిటైర్ అయింతరువాత పెయింటింగ్ మళ్ళీ మొదలు పెట్టారు. ఈ పదేళ్ళలో చాలా మంచి బొమ్మలు వేసారు. (అవి చాలా వరకు రిప్రొడక్షన్సే అనుకోండి, కానీ బాగా వేస్తారు.) మీ చేతుల్లో విద్యా, కళా అంటూ వుండాలే కానీ, ఎప్పుడైనా వాటికి మెరుగు దిద్దుకోవచ్చు.

  All the best
  శారద

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: