5వ కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు

జాజర

5వ కాలిఫోర్నియా తెలుగు సాహితీ సదస్సు


గత అయిదేళ్ళుగా తెలుగు సాహితీ సదస్సు అమెరికాలో జరుపుతున్నాం. అమెరికాలో వున్న తెలుగు సంస్థలకతీతంగా తెలుగు సాహితీ మిత్రులందరం మూకుమ్మడిగా జరుపుతున్నాం. ఏటా రెండు వందలమంది పైగా వస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ అంతా సాహిత్యమే! గతంలో వెల్చేరు నారాయణ రావు, కేతు విశ్వనాథ రెడ్డి, ఎన్.వేణుగోపాల్, వేలూరి వేంకటేశ్వర రావు వంటి పెద్దలు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ సారి జెజ్జాల కృష్ణ మోహనరావు, మురళీ చందూరి, కె.వరలక్ష్మి గార్లు ఈ సదస్సుకి వస్తున్నారు.

“ఆంధ్రాలో కంటే అమెరికాలోనే నయం. సాహితీ సదస్సంటే పుంజీడు జనాలు భూతద్దం వేసినా కనబడరు ఆంధ్రాలో. అటువంటిది దాదాపు రెండొందలమంది రోజంతా ఇలా సాహిత్యం గురించి కబుర్లు చెప్పుకోడం చాలా ఆనందంగా వుంది.” అంటూ నాలుగేళ్ళ క్రితం కేతు విశ్వనాథ రెడ్డి గారన్నారు. శాక్రిమెంటో, లాసేంజిలిస్, బేకర్స్ ఫీల్డ్ వంటి దూర ప్రాతాలనుండి అయిదారు గంటలు ప్రయాణం చేసి కొంతమంది వస్తారు. నిజానికి ఇటువంటి వారి వల్లే ప్రతీ ఏటా తప్పనిసరిగా చెయ్యాలన్న ఉత్సాహం కలుగుతుంది. క్రితం ఏడాది వెల్చేరు గారు “తెలుగు సాహిత్యంలో అనువాదాల ఆవశ్యకత” గురించీ, వేలూరి గారు “డయాస్పోరా కథ” గురించీ చేసిన ప్రసంగాలు అందర్నీ అలరించాయి.

క్రితంసారి సదస్సు చిత్రాలు ఇక్కడ చూడచ్చు. ( కాస్త హైటెక్ హడావిడి కనిపిస్తుంది, కంగారు పడకండి. )

సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారాల్లో ఈ సదస్సు నిర్వహించడం పరిపాటి. ఈ సారి మాకు హాలు దొరకడం కష్టమయ్యింది. ముందుగా ఎవరో బుక్ చేసేసుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్లో అమెరికా ప్రజలకి పన్ను బాధలు. అందుకే ఈ ఆలస్యం. సదస్సు ముగిసాక వివరాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

మీరెవరైనా అమెరికాలో కాలిఫోర్నియా శాన్‌ఫ్రాన్సిస్కో వైపు రావడం తటస్థితే ఈ సదస్సుకిదే ప్రత్యేక ఆహ్వానం.

ఆహ్వాన పత్రం


ప్రవాస వాణి – బే ఏరియా తెలుగు కేంద్రం సమర్పణ

ప్రముఖ సాహితీ వేత్తల ప్రసంగాలూ, స్వీయ కవితా పఠనాలూ, చర్చాగోష్టిల కదంబం

జూన్ 19, 2010 శని వారం 10:00am – 5:00pm

India Community Center
525 Los Coches St
Milpitas, CA 95035 – (408) 934-1130

సాహితీ అభిమానులందరూ పాల్గొని ఈ సదస్సుని జయప్రదం చేయండి.

కథ,కవితా,వ్యాస పఠనమూ లేదా వక్తలుగా పాల్గొనదలచిన ఆసక్తి కలవారు సంప్రదించండి..


ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. బావుందండి. సదరన్ కాలిపోర్నియా నించి పెద్ద దూరం కాదు. నేనొచ్చెద. 🙂

  RSVP చెయ్యాలంటే మీకు ఈమెయిల్ చెయ్యాలా?

  • gorthib said

   పద్మ గారూ, తప్పకుండా రండి. ఈ సదస్సు గురించి మీకు మెయిలు పంపాను.

 2. Thank you for your invitation. I am attending it. I am resident of Edmonton AB Canada. I am on my short visit to Bay-Area.
  I am happy to mention here that I attended IIM USA Global Convention 2010 on June 05. Now I am planning to attend ‘California Saahithya Sadassu, on June 19, which is my Birthday.
  Sincerely,
  Somayya Kasani
  http://www.kasani.org

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: