మనకు తెలియని మన త్యాగరాజు


ఇవాళ త్యాగరాజు పుట్టిన రోజు.

అరవదేశంలో అచ్చ తెలుగు వాహకంపై కర్ణాటక సంగీతానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు.


జాజర


రెండేళ్ళ క్రితం త్యాగరాజుపై ఆసక్తితో ఎన్నో పుస్తకాలనీ, వందేళ్ళ నాటి రాతప్రతుల్నీ, చిత్రాలనీ సేకరించి ఎంతో కష్టపడి ఈమాటలో త్యాగరాజుపై “మనకి తెలియని మన త్యాగరాజు” పేరుతో ఒక వ్యాస పరంపర రాసాను. దీన్ని పుస్తకంగా తేవాలని అనుకుంటున్నానని చెప్పగానే ప్రముఖ చిత్రకారుడు బాపుగారు ముఖచిత్రం గీసిచ్చారు. అంతే కాదు త్యాగరాజుపై ఆయన వద్దనున్న సమాచారమంతా కాపీలు తీసి ఎక్కడో అమెరికాలో ఉంటున్న నాకు పంపించారు. ఆ పెద్దమనసు గొప్పతనం మాటల్లో చెప్పలేను. ఆయనే కాదు ఎంతో మంది ఈ వ్యాస పరంపరకి సహాయం చేసారు. ఇది రాద్దామనుకొని మొదలెట్టిన వేళా విశేషమో ఏమిటో తెలీదు, ఈ పుస్తకం కావాలీ అనుకుంటే వచ్చింది.

ముఖ చిత్రం వేసేటప్పుడు బాపుగారితో, త్యాగరాజుకి హరిదాసు తలపాగ ఉండరాదు. అలాగే రాముడూ, సీతా దేవుళ్ళు వేయద్దు. ఆయన రాసిన పంచ రత్నకృతులు స్ఫురించేలా బొమ్మేసి ఇవ్వమని” అడిగాను. నా ఊహకందనంత ఎత్తులో ఈ ముఖచిత్రాన్ని వేసిచ్చారు.

ఇది త్వరలో పుస్తకంగా రాబోతోంది. ఈమాట వ్యాసంలోలేని మరికొన్ని కొత్త సంగతులూ, రంగురంగుల చిత్రాలూ, విశేషాలతో ఈ పుస్తకం వుంటుంది. ఆసక్తి ఉన్నవారు త్యాగరాజు వ్యాసం ఇక్కడ చదవగలరు.


మనకు తెలియని మన త్యాగరాజు – 1

మనకు తెలియని మన త్యాగరాజు – 2

మనకు తెలియని మన త్యాగరాజు – 3

మనకు తెలియని మన త్యాగరాజు – 4

మనకు తెలియని మన త్యాగరాజు – 5

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. sowmya said

  ఆహా, బాపూగారు ఎంతైనా బాపూగారే, బాపూగారిలాంటి వారు బాపూగారొక్కరే.

  పంచరత్న కృతులు వేయమంటే రాముడి గురించి కాబట్టి, రాముడి చేతి ఐదువేళ్ళు వేసారు……ఆయన కళాదృష్టికి జోహార్లు

  మీకు అభినందనలు !

 2. alapati ramesh babu said

  excellent is small word for both of your effort.sri rama jayam for sri bapu and sri
  sai gorthi.

 3. budugoy said

  ఈమాటలో మీ వ్యాసాలు చదివినపుడే అనుకున్నాను. పుస్తకంగా వస్తే బాగుణ్ణు అని. అభినందనలు. తప్పకకొంటాను.

  1) పంచరత్నకృతులు పాడే ఆరాధనోత్సవాల్లో వీధుల్లో తిరిగి భిక్షాటన చేస్తారని విన్నానే. మరి హరిదాసు పాగా వద్దని అడగడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?
  2) అలాగే పాగాలు ఇప్పుడంటే హరిదాసులు మాత్రమే పెట్టుకుంటున్నారు. అప్పట్లో బయటకు వెళ్తే ఆహర్యంలో భాగమనుకుంటాను. అవుననో కాదనో చెప్పడానికి ఆధారాలున్నాయా?

  • gorthib said

   త్యాగరాజు ఉంఛవృత్తిని స్వీకరించాడు. అంటే బ్రతకాడినికి సరిపడా ఆహారాన్ని రోజూ భిక్షగా స్వీకరించాలి. ఈ వృత్తి స్వీకరించేవారు ప్రతీరోజూ ఒక నిర్ణీత సమయానికి భక్తి పాటలు పాడుకుంటూ ఊరంతా తిరుగుతారు. ఆ సమయానికి ఎవరినా వారంతట వారు ఇచ్చిన ఆహారాన్ని వీళ్ళు స్వీకరిస్తారు. అదీ మరలా వండినది కాదు. కూరలూ, పండ్లూ, పప్పులూ, బియ్యం వంటివి మాత్రమే! వాళంతట వాళ్ళు భిక్షని అడగరు. ఎవరైనా ఇస్తేనే తీసుకుంటారు. ఆ రోజుకెవరూ ఇవ్వకపోతే ఇహ అంతే! త్యాగరాజు ఉంఛవృత్తిని స్వీకరించినా, సినిమాల్లో చూపించినట్లు ప్రతీరోజూ తిరగలేదు. ఎవరైనా కోరితే కచేరీలు చేసేవాడు. పారితోషికానికి బదులుగా ఆహారాన్ని తీసుకునేవాడు. ఇదీ వారానికి ఒకటీ రెండు సార్లు మాత్రమే చేసేవాడు. మనమందరూ అనుకున్నట్లు త్యాగరాజు కటిక దరిద్రమేమీ అనుభవించలేదు.
   అప్పట్లో ఉంఛవృత్తి స్వీకరించినవారు తలపాగా ధరించేవారు. పైగా త్యాగరాజు శిష్యుల్లో హరిదాసులు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఆయన్నీ ఓ హరిదాసుని చేసేసారు. త్యాగరాజు తలపాగా చుట్టిన హరిదాసు కాదు. ఆత్మతో హరిని చుట్టిన వాడు.

   ఈ తలపాగ సాంప్రదాయం మహరాష్ట్రులనుండి వచ్చినదని అనుకుంటున్నాను. తంజావూరుని పాలించిన ఆఖరి రాజులు మహారాష్ట్రులే! దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగునాట తలపాగ సాంప్రదాయం ( మామూలు జనాల్లో ) అంతగా లేదనే చదివాను.

   -బ్రహ్మానందం

   • budugoy said

    sai garu, thanks for the clarification.

    1) త్యాగరాజు ఉంఛవృత్తిని స్వీకరించాడు 2)అప్పట్లో ఉంఛవృత్తి స్వీకరించినవారు తలపాగా ధరించేవారు.
    so what is your objection to depict him with a talapaga? r u saying by depicting him with a talapaga, ppl might misconstrue him to be a haridasu?
    dakshinadina sampradayam ledu kaani gurazada, veeresalingam maatram eppudu talapagato kanipistaaru..may be it was like a formal wear. anyways, irrelevant discussion..
    -commend your work on tyagaraju.
    -loved ur article in eemaata on kadanakutuhalam.

 4. Brahmaandam Gorti said

  త్యాగరాజు 84 ఏళ్ళు జీవించాడు. ఉంఛవృత్తి ముప్పై ఏళ్ళకి స్వీకరించాడు. సుమరుగా ఓ పదేళ్ళు చేసుండవచ్చు. భార్య మరణాంతరం అతను ఉంఛవృత్తి చెయ్య లేదు. భార్య కమలాంబ అతని 44వ ఏటే చనిపోయింది. ఎవరైనా ఓ పదేళ్ళు కళ్ళజోడు ధరించి, మిగతా జీవితమంతా కాంటాక్ట్ లెన్‌సెస్ ధరించారనుకోండి. వారి చిత్రపటం కళ్ళజోడుతోనే చిత్రీకరిండం లాంటిదే ఇది. రామభక్తుడవడం, ఉంఛవృత్తి చేపట్టడం ఇవన్నీ హరిదాసు మేకప్పుకి సరిగ్గా కుదిరాయి. అంతే! ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇల్లుగడవడానికి ఇబ్బందయ్యింది. ఉద్యోగం లేదు. ఉంఛవృత్తి కదా మారి? లాంటి దీన స్థితిని చూపించడానికి ఉపయోగపడిందంతే! త్యాగరాజు ఇంట్లో రోజుకి పాతికమంది పైగా భోజనాలు తినే వారు. మనం అనుకున్నట్లు త్యాగరాజు మరీ అంత బీదవాడు కాదు. డబ్బుకి ఇబ్బంది పడుండచ్చు. కానీ మనం ఊహించినట్లు పూటగడవని స్థితి కాదు. ఇలాంటివన్నీ తెలిసాక ఆయనా మామూలు మనిషే, కాకపోతే ఊహకందన ప్రతిభావంతుడని మాత్రమే చెప్పడం నా ఉద్దేశ్యం. అలాగే రాముడూ, సీతా ఆయనింటికి వచ్చి ఆయనతో మాట్లాడడం ఇవన్నీ పుక్కిట పురాణాలే! నా రచన ఉద్దేశ్యం కూడా అవి చెప్పడమే!

  గురజాడ, వీరేశలింగం, ఇంకా గిడుగు రామ్మూర్తీల చిత్ర పటాల్లో మనకి తలపాగా కనిపిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ధరించే ఉండచ్చు.

 5. సాయి గారూ,
  ఈ పుస్తకం మార్కెట్లో విడుదలైందా..? ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పగలరు..

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: