హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ?


దాదాపు మూడేళ్ళ క్రితం నాటి మాట. అప్పట్లో హేరీపాటర్ పుస్తకం అమెరికాలో రిలీజయిన సందర్భంలో రాసిన వ్యాసం ఇది. ఆంధ్రభూమి, సాహితి లో వచ్చింది.

హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ?

తెలుగులో బాల సాహిత్యం చందమామని దాటి పోలేదు. పూర్వం చాలా పత్రికలు బాల సాహిత్యానికొక పేజీ కేటాయించేవారు. ఇప్పుడదీ లేదు. “పిల్లల కోసం ఒక నవల రాస్తాను. మీరు ప్రచురిస్తారా?” అని పత్రికల చుట్టూ తిరిగితే కాళ్ళరిగి, మన పిల్లలు వృద్ధులయ్యే కాలం వచ్చేస్తుంది.

సరైన సాహితీ అభిరుచి లేని వారు సంపాదకులుగా చెలామణీ అవుతూంటే ఇటువంటి సాహిత్యానికి విలువుండదు.

“యథా సంపాదకా, తధా పాఠకా” అని ఓ నిట్టూర్పు విడవడం తప్ప చేయ గలిగిందేమీ లేదు.

తెలుగులో మరలా బాల సాహిత్యం బ్రతికి బట్టకడుతుందన్న ఆశయితే నాకు లేదు.

బాలారిష్టాలతో బాలసాహిత్యం ఎప్పుడో వెనకబడిపోయింది.

ప్రకటనలు

14 వ్యాఖ్యలు »

 1. బాల సాహిత్యం చందమామ దాటిపోలేదు అన్నారు. చందమామలో తమ కథలద్వారా చెప్పని, నేర్పని విషయం ఏమిటి. చందమామలో దాసరి సుబ్రహ్మణ్యంగారి ధారావాహికలముందు, హారీ పోటర్లు తీసికట్టు. ఆయన వ్రాసిన పన్నెండు ధారావాహికలు ఒక్కొక్కటి వంద హారీ పోటర్లకు సమానం. ఒకసారి చదివి చూడండి, . బాల సాహిత్యానికి అద్భుతమైన కాలంలో మీరు ఈ దేశంలో లేరేమో మరి (1956-57 నుండి 1969-70ల వరకు) చందమామతో బాటుగా ఎన్నెన్ని పత్రికలు బాలల కోసం.

  ఈ నాటి బాలలు, పాశ్చాత్య ప్రభావంలో పడి నలిగిపోతున్నారు కార్టూన్ నెట్ వర్కులు, విదేశీ కామిక్కులు వగైరా వగైరాలతో. చందమామలో ఆ కథలలోని నైర్మిల్యం, గ్రామీణ జీవిన చిత్రీకరణ (ఊహ కాదు నిజమైనది) కథ చెప్తూనే, కొడవటిగంటి వంటి మహా మహుడి సంపాదకత్వంలో ఎన్నెన్ని చక్కటి కథలు నాలుగైదు తరాల చిన్నారులను ఉత్తేజపరిచి, మంచి విషయాలు నేర్చుకునేట్టుగా చేశాయి.

  • gorthib said

   చందమామ మీద నాకు చిన్న చూపు లేదు. మీ అందరిలాగే నేనూ ఆ పత్రిక్కి వీరాభిమానిని.

   బాలసాహిత్యం చందమామ దాటి పోలేదూ అంటే అర్థం – మిగతా పత్రికలు దీన్ని చిన్న చూపు చూసాయన్న భావనతోనే రాసాను. చందమామలో వచ్చిన ఎన్ని ధారావాహికలు పిల్లలకి అందేలా బయట పుస్తక రూపంలో వచ్చాయో చెప్పండి? చందమామలో వచ్చిన విచిత్ర కవలలు అనే నవల బయట ఎక్కడైనా దొరుకుతుందా? నా బాధంతా అదే! పిల్లల్ని సాహిత్యానికి దూరంగా నెట్టేసింది ఎవరు? ఒక్క సారి నింపాదిగా ఆలోచించండి.

   అలాగే చందమామలో వచ్చిన బాలసాహిత్యం గొప్పది కాదని నేను అనలేదు. అనను కూడా.

   -బ్రహ్మానందం

   • చందమామ ధారావాహికలు పుస్తక రూపంలో వేయలేదు. నిజమే. కారణమేమిటి. ఆదరణ లేక. అవి కావాలని కనీసం ఒక వందమంది ఒక్క పోస్టు కార్డు వ్రాసే వారు ఉన్నరా. చలిలోనైనాసరే విదేశీ పుస్తకానికి ఆ షాపు తెరవక ముందే వెళ్ళి పెద్ద వరుసలో నిలబడి హారీ పోటర్ కొనుక్కోవటమే జీవిత ఆశయంగా భావిస్తున్నవారే ఎక్కువటకదా చివరకు మనదేశంలో కూడ. హరీ పోటర్ పుస్తకాలు ప్రచురించే వారి వ్యాపార సరళి మనవారికి లేదు. వాళ్ళకు తెలుసు మనచేత ఎలా కొనిపించుకోవాలో.

    బాల సాహిత్యానికి కావలిసనది ఆదరణ. అది లేదనండి సబబు. ఆదరణ లేకపోవటాంకి కారణం ఎవరు. చదువరులమైన మనమే. మనలో ఎంతమంది, మన కథలను పిల్లలకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాము, మన పిల్లలను చదివించే కాన్వెంట్లలో మన కథలను వాళ్ళు చెప్తున్నారు. ఉగ్గుపాలతో మనం విదేశీ వ్యామోహమే సరైనది అన్నట్టుగా ప్రవర్తిస్తుంటే పాపం పిల్లలు వాళ్ళకేమి తెలుసు అదే గొప్పగా భావిస్తారు. మన చిన్నప్పుడు మన ఇంట్లో తల్లి తండ్రులు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు మనకు ఎన్నెన్ని చక్కటి కథలు చెప్పేవారు. చందమామ వంటి పత్రిక/ల ను కొని తెచ్చి చదివించేవారు. ఇప్పుడు మనం కొని చదివించేది కామిక్కులు. లేదా కార్టూన్ డి వి డి లు. ఎక్కడైనా సరే ప్రజలలో వాళ్ళకు కావలిసినది ఏది, దేనిని ఆదరించి బతికించుకోవాలి అన్న పరిణితి ఉండాలి. గొర్రె దాటుగా బతికేస్తున్నాం. అందుకనే ఒక్క బాల సాహిత్యమేమిటి, అసలు సాహిత్యమే మృగ్యమయ్యిపొయ్యే ప్రమాదం ఉన్నది. మరి మీరు బాల సాహిత్యం చందమామను దాటిపోలేదు అని ఆ పధ్ధతి బాల సాహిత్యాన్ని కించపరచటానికి అనకపోయినా, వచ్చే ధ్వని మాత్రం చందమామను తక్కువపరిచేలాగానే ఉన్నది.

    మీరు చదవాలనుకుంటే చందమామలు 1947 నుండి చందమామవారి వెబ్ లో ఉంచారు. ఎంత కావలంటే అంత చదువుకోవచ్చు. మరొక శుభవార్త. త్వరలో చందమామ ధారావాహికలలో కొన్ని పుస్తక రూపం దాల్చబోతున్నాయట.

   • gorthib said

    చందమామలో ధారావాహికలు పుస్తకాలుగా వేయకపోడానికి కారణం ఆదరణ తక్కువయ్యి కాదు. చందమామకి ధారావాహికలు రాసిన చాలామంది అందులో ఉద్యోగులు, దాసరి గారితో సహా. వారు రాసిన కథలపై వారికి హక్కు లేదు. లేకపోతే ఏ రచయితయినా తను రాసింది పుస్తక రూపంలో చూడాలనే అనుకుంటారు. అప్పట్లో చందమామకి ఆదరణ చాలా ఎక్కువగానే ఉండేది. అప్పుడు కూడా చందమామ పబ్లికేషన్స్ వారు ఎందుకు వేయలేదు? చందమామ మంచి పుస్తకం అనండి. ఔప్పుకుంటాను. అంతేకానీ అందులో వచ్చింది మరలా ప్రచురణకి ఇన్నాళ్ళొ నోచుకోక పోవడానికి కారణాలు అందరికీ తెలుసు.
    నే రాసిన ఒక వాక్యం చుట్టూ మీ వాదన కొనసాగుతోంది. మీరు నేను రాసిన వ్యాసం చదివినట్లుగా అనిపించడంలేదు. నేను బాలసాహిత్యం రావట్లేదనే రాసాను. దయచేసి మరో చదివి అప్పుడు నేనేమయినా తప్పు రాస్తే నిలదీయండి.
    చందమామలో వచ్చినవి పుస్తక్రూపంలో వస్తాయిని ఊరించడం గత నలభై ఏళ్ళుగా వాళ్ళు చేస్తున్న పనే! “నాన్నా పులి వచ్చె” కథ చందమామలో చాలా సార్లే ప్రచురించారు.

    -బ్రహ్మానందం

 2. బాలారిష్టాలతో బాలసాహిత్యం వెనుకబడిందా లేదా హేరీ పాటర్‌ల వెనుక పడి మనం వెనుకబడ్డామా? “తెలుగులో బాల సాహిత్యం చందమామని దాటి పోలేదు.” చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు కథలను నిజంగా చదివే ఇలా అంటున్నారా మీరు? నిజంగా దారిద్ర్యం బాలసాహిత్యానిదా లేదా దాన్ని ఈసడించుకుంటున్న లేక విస్మరిస్తున్న వాళ్లదా? నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంతవరకు… “చందమామలో దాసరి సుబ్రహ్మణ్యంగారి ధారావాహికలముందు, హారీ పోటర్లు తీసికట్టు. ఆయన వ్రాసిన పన్నెండు ధారావాహికలు ఒక్కొక్కటి వంద హారీ పోటర్లకు సమానం.” అంటున్న శివరాం ప్రసాద్ గారి మాటలను గుర్తుపెట్టుకుందాం.

  • gorthib said

   మీరు నా వ్యాసం పూర్తిగా చదివినట్లుగా లేరు. వెలయితే మరో సారి చదవండి. పిల్లలని సాహిత్యానికి దూరంగా నెట్టేసామనే రాసాను. కారణాలు ఏమయితేనేం బాల సాహిత్యం అందుబాటులో లేదు. పిల్లల నవలలు మొత్తంగా ఒకేసారి చదవడం సులభమా? లేక వంద చందమాంలు ముందేసుకొని ఒక దాని తరువత ఒకటి చదవడం మెరుగా?
   నేను చందమామలో వచ్చిన సాహిత్యాన్ని తక్కువ చేసి చెప్పలేదు. అదందించే ప్రక్రియ మీదే నా గోడంతా.
   అలాగే దాసరి గారి రచనల్నీ నేను చులకన చేయలేదు. అవన్నీ చాలా చాలా గొప్పవి. ఎవరూ కాదనరు. మరవన్నీ ప్రస్తుతం మార్కెట్లో కొనుక్కోగలమా?
   పబ్లికేషన్ ఆసరా చేతిలో పెట్టుకొని చందమామ వారెందుకు ఆ ధారావాహికల్ని నవలలుగా ప్రచురించలేదు?

   హేరే పాటరు గొప్పా? లేక మన జానపదలు గొప్పా? అని నేను తర్కించలేదు. వారికున్న ఆసక్తిని చూసి ముచ్చటేసి, మనకెప్పుడయినా అలాంటి రోజొస్తుందా అనే రాసాను. మరో సారి చదవండి.

   -బ్రహ్మానందం

 3. అబ్రకదబ్ర said

  చాలామంది తెలుగోళ్లలో బాపు, విశ్వనాధ్ సినిమాలు తల బొప్పి కట్టించినా ఆహా ఓహో అనకపోతే తమకి కళాహృదయం లేదనుకుంటారేమోననుకునే భావజాలం ఒకటుంది. అలాంటిదే చందమామ విషయంలోనూ అనధికారికంగా అమల్లో ఉందని నా అనుమానం 😉

  చందమామలో అచ్చైనవన్నీ అద్భుతమైన కథలేనంటే ఒప్పుకోవటం – నా వరకూ – కష్టమే. మూసలో పోసినవి చాలానే ఉండేవి చందమామలో. దాని వెనక వాళ్ల కారణాలు వాళ్లకుంటాయనుకోండి. చిన్నపిల్లల సాహిత్యానికి చందమామ పట్టుగొమ్మయిందంటే దానిక్కారణం అంతకన్నా గొప్పవి లేక. ఇలా అంటున్నానని నేనేమీ చందమామని తీసిపారేయటమో, చిన్నబుచ్చటమో చెయ్యటం లేదు. కొన్ని నిజాలు నిష్ఠూరంగా ఉన్నా ఒప్పుకోవాలి కదా.

  ఇంతకీ – నేనేమీ హ్యారీ పాటర్ పంకాని కాను. ఆ పుస్తకాలూ, ఆ సినిమాలూ నాకు వీర బోర్.

  • gorthib said

   హేరీ పాటర్ అమ్మకాలు చూసి అదేదో గొప్ప సాహిత్యమని అమెరికన్లూ అనలేదు. పిల్లలకి సంబంధించి ఎంతగానో ఆకట్టుకున్న వాటిలో ఇది మొదటిది. ప్రపంచవ్యాప్తంగా ఇంతలా ప్రాచుర్యం పొందిన బాల సాహిత్యం లేదు.
   చందమామ విషయంలో నేనూ మీతో ఏకీభవిస్తాను. అప్పట్లో రంగుల్లో ఎంతో రమణీయంగా అచ్చయిన పత్రికల్లో చందమామే మొదటుంటుంది. బుజ్జాయీ, బాలమిత్ర, బొమ్మరిల్లూ కథల విషయంలో ఒక్కోసారి చందమామ స్థాయికొచ్చినా, అచ్చు విషయంలో అంత గొప్పగా ఉండేవి కావు. చందమామకి రంగులద్దిన వడ్డాది పాపయ్యా, శంకర్ వంటి చిత్రకారులకీ ఆ గొప్పలో చాలా వాటా వుంది.

   -బ్రహ్మానందం

 4. స్నేహ said

  అబ్రకదబ్ర గారు, చందమామ విషయంలో నా మనసులో మాట చెప్పారు. చందమామలో వచ్చేవి అన్నీ అద్భుతమైనవే అంటే ఒప్పుకోవడం నాకూ కొంచెం కష్టమే.

 5. Ramana said

  // చిన్నపిల్లల సాహిత్యానికి చందమామ పట్టుగొమ్మయిందంటే దానిక్కారణం అంతకన్నా గొప్పవి లేక …. //

  గొప్పవి లేవంటున్నారు కదా ! “ఎందుకు లేవు ?” అని అనిపించలేదా ? , 20 – 30 యేళ్ళ క్రితం చదివిన బాల సాహిత్యం ఇప్పుడు చదువుతున్నారా ? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. ఒక మూసలో ఉంటున్నాయి కాబట్టి పిల్లలు చదవటం లేదంటే, చదివేవారు లేరు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం రచయితలకీ ఉండదు. కొన్ని సంవత్సరాలకి చదివేవాళ్లు అరకొరా ఉన్న రాయగలిగేవారు ఉండరు. చదివేవారి – రాసేవారి మధ్య సమతుల్యం లోపిస్తేనే ఇలాంటి పరిస్థితి వస్తుంది.

 6. anwar said

  అబ్రక దబ్ర గారితొ ఏకిభవిస్తూ

 7. What a coincidence.
  Similar thoughts here:
  http://tethulika.wordpress.com/2010/02/16/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%82-%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%8b%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b1%87/
  here:
  http://pustakam.net/?p=3717
  This month’s focus on pustakam.net is ‘Children’s literature’.

  Could there be more already blogging on related topics?
  Hopefully all the enthusiasts, advocates, promoters, analysts participate together in a healthy discussion with some practical positive outcome.
  We are not doing a favor to kids.
  All lovers of Telugu literature owe it to themselves to get kids closer to literature and vice versa.
  If we are amazed by the reading that goes on from early days here, it did not happen overnight, nor did it stop. Every day, parents, educators, librarians, authors, publishers and kids are all taking part in this together. They still theink more needs to be done. So, why should we give up?

  As for Harry Potter, it is a phenomenon. It did not happen easily either. The author had it in her. Perhaps her environment contributed to it. Publishers didn’t take notice of the book easily either. It had its difficulty coming out and once it was out, then the magic happened.

 8. బాల సాహిత్యం కు సంబంధించి పుస్తకాలు ఏమైనా వచ్చి వుంటే చెప్పండి. నా చిన్నప్పుడు చదువుకున్న చందమామ వంటి పుస్తక సాహిత్యం ఏదైనా ఫర్వాలేదు. మా పాపకి ఇవ్వాలి. నాకైతే ఇప్పుడు ఎలాంటి బాల సాహిత్యం వుందో తెలీదు. మీ బ్లాగ్ బాగుంది.

 9. Aparna said

  మీరు రాసిన ఆర్టికల్ చదివాను. చాల బాగా రాసారు. మీతో నేను ఏకీబహవిస్తున్నాను. మీరు ఏమీ అనుకోనంటే ఒకటి చెబుతాను. మీరు ఆ ఆర్టికల్ కి పెట్టిన టైటిల్ ” హేరీ పాటర్ ఎక్కడ? మనం ఎక్కడ? అనేది అభ్యంతరకరంగా ఉందని నా ఉద్దేశ్యం. – అపర్ణ

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: