ద్రౌపది గురించే మరోసారి…

జాజర


మతగ్రంధాలనీ, కావ్యాలని ఏ విధంగా చదవాలీ, వాటిపై వచ్చే కాల్పానిక సాహిత్యాన్ని ఎలా చూడాలీ అన్న విషయాలపై సౌదాహరణంగా రాసిన వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాసం వివిధ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. చాలా మంచి వ్యాసం.
ఈ క్రింది లింకులో చదవ్వచ్చు.


ద్రౌపది నవలపై మరో కోణం నుంచి… – వేలూరి వేంకటేశ్వర రావు


సాహిత్య అకాడమీ సభ్యుల్ని నేను ప్రశ్నించినట్లుగానే ఈయనా అడిగారు. పెద్ద మనిషి తరహాగా ప్రశ్నించారు, కమిటీ సభ్యులు వివరణిస్తే బాగుంటుందని.

బహుమతులు ముట్టజెప్పడమే కానీ, అవొచ్చిన రచనలు ఎందుకార్హత పొందాయో చెప్పే ఆనవాయితీ తెలుగు సాహిత్యంలో అంతగా అలవాటు లేదు. ఎవరికెవరూ జవాబుదారీలు కారు.

వాళ్ళెవ్వరూ పెదవి విప్పరు. కానీ వేరే కొంతమంది వచ్చే వారం ధ్వజమెత్తే అవకాశాలున్నాయి. మంచిదే! ఈ రకంగానయినా మంచి సాహితీ చర్చ జరుగుతుంది. ముందు ముందు సాహిత్య అకాడమీ అవార్డులిచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు వారికి వారే ప్రశ్నించుకునే సందర్భం కలిగించినట్లవుతుంది.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. సాహిత్య అకాడమీ ఎందుకిచ్చారో వివరణ ఇవ్వాలని ఆశించడం నాకెందుకో హాస్యాస్పదం అనిపిస్తోంది. ముగ్గురు సభ్యుల్లు కలిసి తీసుకున్న నిర్ణయం ముప్ఫైమంది కలిస్తే మారొచ్చు. ఇలాంటి నిర్ణయాలలో objectivity అనేది subjectivity లోని integrity ని బట్టి ఉంటుంది. ఆ ఇంటిగ్రిటీ సందేహాస్పదమైన తరువాత వివరణలూ,విశ్లేషణలూ మాత్రం తృప్తినిస్తాయా?

  “And of course, they are honorable people!” అంటూ ముగించిన వ్యాసంలో వ్యాసకర్త అన్యాపదేశంగానే తనకు లేని నమ్మకాన్ని చెప్పేశారు. ఇకవారు ఆశించింది దొరికిన్నా అంగీకరించగలిగేది ఎంతుంటుంది?

 2. వేలూరి గారి వ్యాసాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
  @ మహేష్ .. అంగీకరించనక్కర్లేదు, అవగాహన కలిగితే చాలు. న్యాయనిర్ణేతలు ఆ అవకాశం కూడా ఇవ్వలేదనేది ఈ వ్యాసం తెచ్చిన ముఖ్య అభియోగం.

 3. అబ్రకదబ్ర said

  >> “ఈ రకంగానయినా మంచి సాహితీ చర్చ జరుగుతుంది”

  అప్పు తచ్చు. సాహితీ రచ్చ అనాలేమో 😉

 4. rAm said

  ‘ద్రౌపది’కి సాహిత్య అకాడమీ అవార్డుపై పిటిషన్‌’

  మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ద్రౌపది పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రజ్ఞాభారతి నిర్వాహక కార్యదర్శి బి.సుబ్రమణ్యశర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.మీనాకుమారి, జస్టిస్‌ బి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈనెల 10వ తేదీలోగా అవార్డు ప్రదానంపై ఉన్న అభ్యంతరాలను కేంద్ర ప్రసారశాఖ మంత్రికి విజ్ఞప్తి చేయాలని సూచించింది. ఈ వినతి పత్రంపై కేంద్ర మంత్రి 15వ తేదీలోగా నిర్ణయాన్ని వెలువరించాలంటూ కేసును అదే తేదీకి వాయిదా వేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన ‘ద్రౌపది’ పుస్తకానికి అవార్డు ప్రకటించడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్‌ తెలిపారు. ద్రౌపది పాత్ర చిత్రీకరణ అభ్యంతరకరంగా ఉందని, మహాభారతాన్ని వక్రీకరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పలువురి మనోభావాలను కించపరిచేలా ఉన్న రచనకు అవార్డు ఇవ్వడం సరికాదన్నారు. వాస్తవానికి ఈపుస్తకం 2006లో ప్రచురితమైందని, 2008లో సాహిత్య అకాడమీకి దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించిందని తెలిపారు. అయితే ప్రస్తుతం అవార్డు ప్రకటించారని, ఈనెల 16న ప్రదానం చేయనున్నారని తెలిపారు.

  source :http://eenadu.net/story.asp?qry1=36&reccount=45

 5. రవి said

  మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు.

  వేలూరి వారు ఉటంకించిన పాశ్చాత్య విధానం లా కొన్ని మౌలికమైన మార్పులు ఇక్కడా రావాలేమో. అవార్డు కమిటీ వారు ఇప్పటికే అవార్డు నిర్ణయించేశారు కాబట్టి, ఒకవేళ వారు వివరణ ఇచ్చినా, ఆ వివరణ వారి నిర్ణయాన్ని సమర్థిస్తూ biased గానే సాగే అవకాశం ఉంది.

RSS feed for comments on this post · TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: