సరిహద్దు – కథల పుస్తకం
గత పదేళ్ళుగా నేను రాసిన కథల్లోంచి పాతిక కథలు ఏరి ఒక పుస్తకంగా వేసాను.
ఈ నెల తానా 18వ సమావేశంలో ఈ పుస్తకాన్ని విడుదల చేసాను.
ముందు మాటల్లాంటివి లేకుండా కేవలం కథలు మాత్రమే ఉంటాయి. అట్ట వెనుక భాగంలో శ్రీ కేతు విశ్వనాధరెడ్డి, శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు, శ్రీ వాసిరెడ్డి నవీన్ వ్యాఖ్యలు క్లుప్తంగా ఉన్నాయి.
పుస్తకం కావల్సిన వారు – నన్ను సంప్రదించవచ్చు. లేదా ఇక్కడ కొనుక్కోవచ్చు.



కొత్తపాళీ చెప్పబడిన
అభినందనలు.
అఫ్సర్ చెప్పబడిన
శుభాభినందనలు, బ్రహ్మానందం గారు
పుస్తకం మీద సమీక్షలు కూడా బ్లాగ్ లో పెట్టండి.
ముఖచిత్రం బాగుంది, ఆ చిత్రకారుడు ఎవరు?
Admin చెప్పబడిన
అఫ్సర్, కొత్తపాళీ గార్లకి,
మీ అభినందనలకి కృతజ్ఞతలు.
ముఖ చిత్రం, పాండు గారని క్రితం ఏడాది పోయినతరువాత నేను తెలుసుకున్న వ్యక్తి. ఆయనేసిన బొమ్మలు చాలా విభిన్నంగా ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చి, వారి కుటుంబం అనుమతితో ముఖచిత్రంగా పెట్టుకున్నాను. ఈ విషయంలో అన్వర్, రవీ సహాయం చేసారు.
-బ్రహ్మానందం
Krishnapriya చెప్పబడిన
బ్రహ్మానందం గారు,
చాలా సంతోషం. మీ మొదటి కథ నుంచీ చదువుతూనే ఉన్నాను. మీకు గుర్తుండక పోవచ్చు. కానీ… కొన్ని సార్లు బే ఏరియా లో మిత్రుల ఇళ్లల్లో కలిసినప్పుడు మీ కథలు,కవితల చర్చలు జరిగినప్పుడు నేనూ పాల్గొన్నాను. ఇండియా లో ఈ పుస్తకం ఎక్కడ దొరుకుంటుందో చెప్పగలరు.